నా బయోపిక్ తీయాలని ఉంది.. నేనే తీస్తా: మల్లారెడ్డి

  • పవన్ సినిమాలో విలన్ పాత్ర కోసం తనను సంప్రదించారన్న మల్లారెడ్డి
  • విలన్ అంటే హీరో చేతిలో తన్నులు తినాలని.. అది తనకు ఇష్టం లేదని వ్యాఖ్య
  • తన పాత్రకు ఏ హీరో సెట్ అయితే ఆయనను తీసుకుంటామని వెల్లడి

తెలంగాణ రాజకీయాల్లో తనదైన ట్రేడ్ మార్క్ స్పీచ్‌లతో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన జీవితకథను సినిమాగా తీయాలని ఉందని... ఆ సినిమాను తానే తీస్తానని ఆయన అన్నారు.


పవన్ కల్యాణ్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'లో విలన్ పాత్ర కోసం తనను సంప్రదించారని... తాను ఒప్పుకోలేదని మల్లారెడ్డి చెప్పారు. విలన్ అంటే హీరో చేతిలో దెబ్బలు తినాల్సి ఉంటుందని, వేలాది మంది తన విద్యార్థులు, అభిమానుల ముందు అలా కనిపించడం తనకు ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు.

తాను త్వరలోనే సినిమాల్లోకి వస్తానని మల్లారెడ్డి తెలిపారు. తన పాత్రకు ఏ హీరో సెట్ అవుతారని డైరెక్టర్ చెబుతారో ఆయననే తీసుకుంటామని... ఆ సినిమాలో తాను కూడా ఒక ప్రధాన పాత్రలో నటిస్తానని చెప్పారు. 

Malla Reddy
BRS
Biopic

More Telugu News